Posted in

FD vs RD: 5 ముఖ్యమైన తేడాలు & ఉత్తమ పెట్టుబడి ఎంపిక

FD VS RD

FD vs RD : మనలో చాలా మంది సంపాదన వచ్చినప్పుడు, ఖర్చుపోయిన తర్వాత మిగిలిన డబ్బును ఎక్కడ పెట్టుబడి చేయాలో తడబడి పోతుంటారు. “సేవింగ్” అనే పదం చిన్నదే అయినా, జీవితంలో చాలా పెద్ద అర్థం ఉంది. ఇది మన భవిష్యత్తుకి ఒక బలమైన అడ్డుగోడలా నిలుస్తుంది. అయితే ప్రశ్న ఏంటి అంటే – ఎందులో పెట్టుబడి చేయాలి? FDలోనా? లేక RDలోనా?

ఈ వ్యాసంలో మీరు FD (Fixed Deposit) మరియు RD (Recurring Deposit) మధ్య తేడాలను, లాభాలను, ఎవరికీ ఏది బెటరా అనే దాన్ని స్పష్టంగా అర్థం చేసుకోగలరు.

FD అంటే ఏమిటి?

FD అంటే ఫిక్స్‌డ్ డిపాజిట్ ( FIXED DEPOSIT ). దీనిలో మీరు ఒకేసారి ఒక పెద్ద మొత్తాన్ని బ్యాంకులో జమ చేస్తారు. ఆ డబ్బు ఒక నిర్దిష్ట కాలానికి (ఉదాహరణకి 1, 3 లేదా 5 సంవత్సరాల పాటు) బ్యాంకులో ఉంటుంది. దీనికి మీరు ముందే నిర్ణయించిన వడ్డీ రేటు పొందుతారు.

ఉదాహరణ : మీరు ₹1,00,000ను FDగా 3 సంవత్సరాలకు, 7% వడ్డీ రేటుతో బ్యాంకులో పెట్టారు అనుకుంటే, 3 సంవత్సరాల తర్వాత మీరు దాదాపు ₹1,23,000 పొందుతారు.

FDలో పెట్టిన డబ్బును కాలం పూర్తి అయ్యే వరకు వాడలేరు. అయితే అవసరమైతే మిడ్‌ బ్రేక్ (మద్యలో తీయుట) చేయవచ్చు కానీ కొంత వడ్డీ కోత పడి మిగిలిన డబ్బు మాత్రమే వస్తుంది.

see also – ప్రతి నెల ₹500 SIP పెట్టుబడి చేస్తే 10 లక్షలు వస్తాయా?

RD అంటే ఏమిటి?

RD అంటే రికరింగ్ డిపాజిట్ ( Recurring Deposit ). దీనిలో మీరు ప్రతి నెల ఒక నిర్దిష్ట మొత్తాన్ని బ్యాంకులో జమ చేస్తారు. ఇది చిన్న స్థాయి సేవింగ్స్ చేసుకునే వారికి చాలా ఉపయోగపడుతుంది.

ఉదాహరణ: మీరు ప్రతి నెల ₹2,000ను 2 సంవత్సరాల RDకి వేసుకుంటే, చివరకు మీరు ₹48,000తో పాటు దాదాపు ₹3,000 నుంచి ₹4,000 వడ్డీ కూడా పొందుతారు.

ఇది నెలనెలా ఆదా చేయాలనుకునే వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే కచితంగా సేవింగ్స్ అలవాటు పడుతుంది.

FD vs RD: తేడాలు

అంశంFDRD
డబ్బు పెట్టే విధానంఒకేసారి పెద్ద మొత్తం జమనెలనెలా ఒకే స్థిరమైన మొత్తం జమ
వడ్డీ రేటుకొంచెం ఎక్కువగా ఉంటుందిFDతో పోలిస్తే కొంచెం తక్కువ
లాభంఎక్కువతక్కువ
సరైనది ఎవరికీ?ఒక్కసారిగా పెద్ద మొత్తాన్ని పెట్టగలిగిన వారికినెలనెలా ఆదా చేయాలనుకునే వారికి
డిసిప్లిన్అవసరం లేదుసేవింగ్స్ అలవాటు అవుతుంది
టెన్యూర్7 రోజులు నుంచి 10 సంవత్సరాలు6 నెలల నుంచి 10 సంవత్సరాలు

ఎందులో పెట్టుబడి చేస్తే ఎక్కువ లాభం వస్తుంది?

ఇక్కడే అసలు విషయం. FDలో మీరు డబ్బు మొత్తాన్ని ఒకేసారి జమ చేయడం వల్ల, మొదటి రోజు నుంచే మొత్తానికి వడ్డీ లెక్కపెడతారు. కాబట్టి FDలో లాభం ఎక్కువగా ఉంటుంది.

RDలో మీరు నెలనెలా డబ్బు జమ చేస్తారు కాబట్టి, మొదటి నెల డబ్బుకు మాత్రమే ఎక్కువ కాలం వడ్డీ లభిస్తుంది. చివరి నెల డబ్బుకు మాత్రం తక్కువ కాలానికి మాత్రమే వడ్డీ లభిస్తుంది. అందువల్ల, మొత్తం లాభం FD కన్నా తక్కువగా ఉంటుంది.

ఎవరెవరు FD ఎంచుకోవాలి?

  • ఉద్యోగం నుండి బోనస్, లాంప్‌సమ్ డబ్బు వచ్చిన వారు
  • ఖర్చులకు మిగిలిన పెద్ద మొత్తం ఉన్నవారు
  • భవిష్యత్తులో అవసరమయ్యే పెద్ద లక్ష్యాల కోసం (గృహ నిర్మాణం, పిల్లల చదువు మొదలైనవి)

ఎవరెవరు RD ఎంచుకోవాలి?

  • నెలవారీ ఆదాయంతో జీవించే మధ్య తరగతి ప్రజలు
  • చిన్న మొత్తాలతో సేవ్ చేయాలనుకునే వారు
  • సేవింగ్స్ అలవాటు చేసుకోవాలనుకునే విద్యార్థులు, ఉద్యోగ ప్రారంభ దశలో ఉన్నవారు

కొన్ని ఉదాహరణలు

Example 1: రమేష్‌కు బోనస్‌గా ₹1,00,000 వచ్చింది. ఆయన దానిని FDగా పెట్టాడు 2 సంవత్సరాలకి. వడ్డీగా దాదాపు ₹15,000 లభించింది.

Example 2: శ్రీలత ప్రతి నెల ₹2,000 RDలో వేసింది. 2 సంవత్సరాల తరువాత ₹48,000తో పాటు ₹3,500 వడ్డీ వచ్చింది.

ఇక్కడ FDలో లాభం ఎక్కువగా కనిపిస్తోంది. కానీ RDలో consistency తో సేవింగ్స్ అలవాటు అవుతుంది.

FD vs RD రెండింటికీ సంబంధించి ముఖ్యమైన విషయాలు

  • TDS (Tax Deducted at Source): వడ్డీ సొమ్ము వార్షికంగా ₹40,000 (సీనియర్ సిటిజన్లకు ₹50,000) దాటితే బ్యాంకులు టాక్స్ కట్ చేస్తాయి.
  • Tax Saving FD: 5 సంవత్సరాల FDలు 80C కింద టాక్స్ మినహాయింపు పొందుతాయి.
  • Premature Withdrawal: FDని మధ్యలో బ్రేక్ చేయవచ్చు, కానీ వడ్డీ తక్కువగా వస్తుంది. RDని కూడా ఆపొచ్చు కానీ కొన్ని బ్యాంకులు పెనాల్టీ వసూలు చేస్తాయి.

ముగింపుగా…

FD vs RD రెండూ సురక్షితమైన, నమ్మదగిన పెట్టుబడి మార్గాలు. కానీ మీ ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా ఎంచుకోవడమే ముఖ్యం.

  • పెద్ద మొత్తాన్ని ఒకేసారి పెట్టగలగడం ఉంటే → FD ఉత్తమం
  • నెలనెలా ఆదా చేయాలనుకుంటే → RD మంచిది

ముఖ్యంగా మీరు దీర్ఘకాలిక సేవింగ్స్ చేయాలనుకుంటే, FD మంచి లాభాన్ని ఇస్తుంది. కానీ డిసిప్లిన్‌తో, అలవాటు చేసుకోవాలని చూస్తే RD ప్రారంభించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *