
మన చుట్టుపక్కల చాలామంది “Stock Market” అనే పదం వింటుంటాం. కానీ ఇది అసలు ఏమిటి, ఎలా పనిచేస్తుంది, మనం దానిలో ఎలా డబ్బు పెట్టాలి అనే విషయాలు చాలా మందికి క్లారిటీగా తెలియవు. ఈ రోజు మనం “Stock Market అంటే ఏమిటి” అనే దానిని simple Telugu explanation లో చూద్దాం.
సాధారణంగా చెప్పాలంటే, Stock Market అంటే కంపెనీలు తమ సొంత భాగాన్ని (ownership share) ప్రజలకు అమ్మే స్థలం. ఒక కంపెనీకి 1,00,000 షేర్లు ఉంటే, మీరు 100 షేర్లు కొంటే, మీరు ఆ కంపెనీలో చిన్న భాగస్వామి అవుతారు. అంటే కంపెనీ లాభాల్లో మీకు కూడా చిన్న భాగం ఉంటుంది. దీనినే share market అంటారు.
ఇది ఏదైనా physical market కాదు. మొత్తం వ్యవస్థ online platform మీద జరుగుతుంది. భారతదేశంలో రెండు ప్రధాన స్టాక్ ఎక్స్చేంజ్లు ఉన్నాయి
Bombay Stock Exchange (BSE) మరియు National Stock Exchange (NSE). ఈ exchanges లో listed అయిన కంపెనీల షేర్లను మీరు Demat Account ద్వారా కొనుగోలు చేయవచ్చు.
Check – Post Office స్కీమ అంటే ఏమిటి
ఒక కంపెనీకి కొత్త ప్రాజెక్ట్స్ చేయడానికి, business expand చేయడానికి డబ్బు అవసరం అవుతుంది. Bank loans తీసుకోవడం కంటే, కంపెనీలు public నుండి funds సేకరించడం ఇష్టం పడతాయి. దాని కోసం IPO (Initial Public Offering) అనే process ద్వారా తమ shares ప్రజలకు విక్రయిస్తాయి. ఇలా investors నుండి వచ్చిన డబ్బుతో కంపెనీ development చేస్తుంది, investors కి ownership వస్తుంది.
ఇప్పుడు మనకు doubt వస్తుంది “ఇలా shares కొనడం ద్వారా మనకు income ఎలా వస్తుంది?” అని. స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాదించడానికి మూడు మార్గాలు ఉన్నాయి. మొదటిది Capital Appreciation. ఒక share ను ₹100కి కొనుగోలు చేస్తే, అది ₹150 అయ్యింది అంటే ₹50 లాభం. దీన్ని capital gain అంటారు.
రెండవది – Dividends. కంపెనీకి profit వస్తే, కొన్ని కంపెనీలు shareholders కు dividend రూపంలో డబ్బు ఇస్తాయి.
మూడవది – Trading Profits. Short-term buying, selling ద్వారా కూడా కొంత income వస్తుంది.
ఇంతవరకు బాగానే ఉంది కానీ, స్టాక్ మార్కెట్లో risk కూడా ఎక్కువగా ఉంటుంది. Price రోజువారీగా మారుతుంది దీనినే market volatility అంటారు. కొన్ని రోజులు share price పెరుగుతుంది, కొన్ని రోజులు తగ్గుతుంది. అందుకే blindly invest చేయకుండా, knowledge, patience ఉండాలి.
Beginners కోసం simple suggestion ఏంటంటే మొదట చిన్న amounts తో start చేయండి.
Demat account open చేసి, good companies (TCS, Infosys, HDFC, etc.) లో కొద్దిగా invest చేయండి.
Short-term trading కాకుండా, long-term investing mentality ఉంచుకోండి.
ఒక ఉదాహరణగా తీసుకుందాం. Suppose మీరు ₹1000 తో TCS అనే కంపెనీ లో 5 shares కొనుగోలు చేశారు. ఒక సంవత్సరం తరువాత company performance బాగుంటే, share rate ₹250కి పెరిగింది. మీ total investment ₹1250 అవుతుంది అంటే ₹250 లాభం. దీనితో పాటు company dividend ఇచ్చినా, మీరు double benefit పొందుతారు.
- స్టాక్ మార్కెట్లో ఉన్న ముఖ్యమైన పదాలు కూడా తెలుసుకోవాలి.
- Share అంటే కంపెనీలో చిన్న భాగం, Investor అంటే దీర్ఘకాలం పెట్టుబడి పెట్టేవాడు,
- Trader అంటే రోజువారీగా కొనుగోలు, అమ్మకం చేసే వ్యక్తి.
- IPO అంటే కంపెనీ మొదటిసారి shares ప్రజలకు ఇవ్వడం,
- Portfolio అంటే మన మొత్తం investments collection.
మన దేశంలో స్టాక్ మార్కెట్‌కి రెండు ప్రధాన platforms ఉన్నాయి – BSE మరియు NSE. ఇవి SEBI (Securities and Exchange Board of India) కంట్రోల్లో ఉంటాయి.
SEBI యొక్క పని ఏమిటంటే – పెట్టుబడిదారుల డబ్బు సురక్షితంగా ఉండేలా చూడటం, మార్కెట్ లో న్యాయం జరిగేలా regulations చేయడం.
స్టాక్ మార్కెట్ అంటే జూదం కాదు. ఇది ఒక financial system ఇక్కడ knowledge, patience ఉన్నవారు మాత్రమే విజయవంతం అవుతారు. ఒక్కరోజులో లాభం రావడం కష్టం, కానీ discipline గా 5-10 సంవత్సరాలు పెట్టుబడి పెడితే wealth creation ఖచ్చితంగా సాధ్యమే.
ప్రస్తుతం Zerodha, Groww, Upstox వంటి brokers ద్వారా mobileలోనే account open చేసి invest చేయవచ్చు. ప్రతి నెల చిన్న SIP లేదా direct stock purchase ద్వారా మొదలు పెట్టండి. ముఖ్యంగా, మీకు అర్థమయ్యే కంపెనీలలోనే పెట్టుబడి పెట్టండి.
సంక్షిప్తంగా చెప్పాలంటే– Stock Market అంటే డబ్బు త్వరగా సంపాదించే స్థలం కాదు. ఇది long-term wealth building platform. పేషెన్స్ ఉన్నవారికి ఇది real opportunity.
“In Stock Market, Time in the market is more important than Timing the market.”
